Published : 04 Aug 2020 01:25 IST

దగ్గుకు పైనాపిల్‌ రసం!

పైనాపిల్‌ రసంలో బ్రొమెలనిన్‌ ఎంజైమ్‌ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లో జిగురు ద్రవం కరిగేలా చేస్తుంది. కణజాలంలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌), నొప్పి తగ్గటానికీ తోడ్పడుతుంది. ఇలా దగ్గు తగ్గటంలో సాయం చేస్తుంది. ఆస్థమా, ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలు తగ్గుముఖం పట్టటానికీ దోహదం చేస్తుంది. పైనాపిల్‌లో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కరోనా కాలంలో ఇంతకన్నా కావాల్సిందేముంది? కప్పు పైనాపిల్‌ రసంలో కాసింత ఉప్పు, మిరియాల పొడి, అల్లం రసం, ఒకటిన్నర చెంచాల తేనె, పావు కప్పు నిమ్మరసం కలిపి తాగితే దగ్గు ఇంకా బాగా తగ్గే అవకాశముంది. పైనాపిల్‌లోని విటమిన్‌ సి కంటి చూపునూ మెరుగుపరుస్తుంది. ఇక పీచు జీర్ణక్రియ సజావుగా సాగటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది. మాంగనీసైతే కణాలు దెబ్బతినకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు ముంచుకురాకుండా చేస్తుంది. బీటా కెరటిన్‌, రాగి, జింక్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు సంతానం కలిగే అవకాశాలను ఇనుమడింపజేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని