గింజపప్పులు వేయిస్తున్నారా?

ఏం తినాలో కాదు, ఎలా తినాలో కూడా తెలియాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బాదం, జీడి పప్పు, పిస్తా వంటి గింజపప్పుల ...

Published : 15 Sep 2020 01:36 IST

ఏం తినాలో కాదు, ఎలా తినాలో కూడా తెలియాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బాదం, జీడి పప్పు, పిస్తా వంటి గింజపప్పుల (నట్స్‌) విషయంలో పొరపాట్లు తగవు. రుచి కోసం కొందరు వీటిని వేయిస్తుంటారు. వేయిస్తే రుచి పెరగటం నిజమే గానీ ఇదంత మంచిది కాదు. గింజపప్పులను వేయించినప్పుడు వీటిల్లోని మంచి కొవ్వులు దెబ్బతింటాయి. గింజపప్పుల్లో విటమిన్‌ ఇ, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలూ దండిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే. వేయించినప్పుడు ఇవీ దెబ్బతినే ప్రమాదముంది. విశృంఖల కణాల పనిపట్టే యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతింటే మేలు కన్నా కీడే ఎక్కువ. గింజపప్పులను వేయిస్తే అక్రిలమైడ్‌ అనే రసాయనమూ పుట్టుకొస్తుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. అంతగా గింజపప్పులను వేయించాలనుకుంటే తక్కువ వేడి మీద వేయించుకోవచ్చు. అలాగే ఎక్కువ సేపు వేగకుండానూ చూసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని