అటు మధుమేహం.. ఇటు కాలుష్యం
మధుమేహంతో బాధపడుతున్నారా? లేదూ ముందస్తు మధుమేహం.. అదే మధుమేహంలోకి అడుగుపెట్టే దశలో ఉన్నారా? అయితే వాయు కాలుష్యం బారినపడకుండా చూసుకోండి. లేకపోతే ఊపిరితిత్తులు తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతినే ప్రమాదముంది. మధుమేహం, ఇన్సులిన్ నిరోధకతలతో ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడే (ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్) ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇందుకు ఓజోన్‌తో కలుషితమైన వాతావరణం ఆజ్యం పోస్తుండటం గమనార్హం. ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ తీవ్ర సమస్య. దీని బారినడ్డవారిలో ఊపిరితిత్తుల్లోని గాలి గదులు, రక్తనాళాలు, శ్వాస మార్గాల చుట్టూరా ఉండే మృదువైన కణజాలం గట్టిపడుతుంది. దీంతో ఊపిరితిత్తులు వ్యాకోచించటం తగ్గుతుంది. శ్వాస ఆడటం కష్టమవుతుంది. ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరిగిపోతుంది. ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. ఒకసారి ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడితే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యం. సాధారణంగా ఆజ్‌బెస్టాస్ వంటి హానికర పదార్థాలకు దీర్ఘకాలంగా గురికావటం వల్ల ఇది తలెత్తుతుంటుంది. కీళ్లవాతం వంటి స్వీయ రోగనిరోధక సమస్యలూ కారణం కావొచ్చు. ఇప్పుడు ఓజోన్, మధుమేహం సైతం దీనికి దోహదం చేస్తున్నట్టు తేలటం గమనార్హం. ఆజ్‌బెస్టాస్ మాదిరిగానే ఓజోన్ కూడా వాయు కాలుష్య కారకమే. ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం సైతం స్వీయ రోగనిరోధక సమస్యలే. ఇవి రెండూ తోడై ఊపిరితిత్తుల్లో వాపు ప్రక్రియను ప్రేరేపించి, చెరగని మచ్చపడేలా చేసి.. చివరికి మృదువైన కణజాలాన్ని గట్టిపరుస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. పట్టణాల్లో కాలుష్యం ఎక్కువవుతుండటం.. ముందస్తు మధుమేహం, మధుమేహం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇది మరింత కలవరం కలిగిస్తోంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia oil: 3 నెలల్లో 24 బి.డాలర్ల రష్యా చమురు కొనుగోలు చేసిన భారత్, చైనా
-
India News
Rahul Gandhi: భాజపా ముఖ్య సమస్యల్ని మేనేజ్ చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోంది: రాహుల్
-
General News
Breast cancer: రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేదెలా తెలుసుకోండి
-
Sports News
IND vs ENG : ఇంగ్లాండ్ వేదికగా.. పొట్టి కప్ కోసం సమర శంఖం పూరించేనా..?
-
General News
‘నా పెన్ను పోయింది.. వెతికిపెట్టండి’.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ
-
Politics News
LPG Hike: ‘మహా’ ఖర్చులను పూడ్చుకునేందుకే గ్యాస్ ధరను పెంచారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Venu Madhav: ఒక్క సీన్ అనుకుంటే మూడు సీన్లు అయ్యాయి
- Trending English words:ఈ 10 ట్రెండింగ్ ఇంగ్లిష్ పదాల గురించి తెలుసా?
- Driver Jamuna: ‘డ్రైవర్ జమున’గా ఐశ్వర్య రాజేశ్.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
- Happy Birthday: అతిథిగా టామ్ క్రూజ్.. సరదాగా ‘హ్యాపీ బర్త్‌డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
- Telangana News: నిమ్జ్ కోసం బలవంతపు భూసేకరణ.. రైతు బిడ్డ ఆవేదన
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!