మధుమేహ ‘ఉబ్బరం’!

దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేవారు కడుపుబ్బరం, కింది నుంచి గ్యాస్‌ పోవటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీనికి మూలం పేగుల కదలికలు నెమ్మదించటం. దీంతో తిన్న ఆహారం త్వరగా ముందుకు కదలదు.

Published : 22 Dec 2020 00:57 IST

దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేవారు కడుపుబ్బరం, కింది నుంచి గ్యాస్‌ పోవటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీనికి మూలం పేగుల కదలికలు నెమ్మదించటం. దీంతో తిన్న ఆహారం త్వరగా ముందుకు కదలదు. ఇందుకు జీర్ణకోశానికి వెళ్లే వేగస్‌ నాడి దెబ్బతినటం, కడుపు కండరాల పటుత్వం తగ్గటం, జీర్ణాశయం సరిగా సంకోచించకపోవటం, జీర్ణాశయ కండరాల పనితీరు మందగించటం వంటివెన్నో దోహదం చేస్తుంటాయి. తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం, మొత్తంగా ఆహారంలో కేలరీలను.. పాలు, పాల పదార్థాలను తగ్గించుకోవటం, పచ్చి పదార్థాలను తినకపోవటం ద్వారా జీర్ణ ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని