రక్తపోటు హెచ్చుతగ్గులా?
ఇటీవల తీవ్ర రక్తపోటు హెచ్చుతగ్గుల మూలంగా సినీ నటుడు రజనీకాంత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రక్తపోటు హెచ్చుతగ్గులంటే ఏమిటి? దీంతో వచ్చే ముప్పేమిటి?
మన రక్తపోటు రోజంతా ఒకేలా ఉండదు. అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది. శారీరక శ్రమ, వ్యాయామం, ఒత్తిడి, కోపం, రాత్రిపూట సరిగా నిద్రపట్టకపోవటం వంటివి రక్తపోటు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా ఉదయం పూట రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అలాగే చలికాలంలో కూడా. సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి కాల్చినప్పుడు.. కాఫీ తాగినప్పుడు తాత్కాలికంగా 30 నిమిషాల వరకు రక్తపోటు పెరుగుతుంది. చాలావరకు ఇలాంటి మామూలు కారణాలతో రక్తపోటు 30 మి.మీ.కన్నా లోపే ఎక్కువవుతుంది. ఉదాహరణకు- పై సంఖ్య 120 నుంచి 150 వరకు చేరుకోవచ్చు. కానీ కొందరికి ఇంతకన్నా ఎక్కువగా పెరగొచ్చు. అదీ ఉన్నట్టుండి. ఇలాంటి పరిస్థితిలో ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయాల్సి ఉంటుంది. పై సంఖ్యకు 20, కింది సంఖ్యకు 10 చేర్చుకుంటూ.. 140/90, 160/100, 180/110, 200/120.. ఇలా రక్తపోటు తీవ్రతను, ప్రమాదాన్ని పసిగడతారు. పై సంఖ్య 200కు మించితే రక్తనాళాలు చిట్లే ప్రమాదముంది. ముక్కులో రక్తనాళాలు చిట్లితే ముక్కు నుంచి రక్తం వస్తుంది. మెదడులో రక్తనాళాలు చిట్లితే పక్షవాతం తలెత్తుతుంది. ఇక కింది సంఖ్య పెరుగుతూ వస్తున్నకొద్దీ గుండె మీద భారం పెరుగుతూ వస్తుంది. ఇది గుండెనొప్పికి దారితీయొచ్చు. గుండె కండరం బలహీనపడితే గుండె విఫలం కావొచ్చు. మామూలుగానైతే రక్తపోటు పెరిగినప్పుడు పై, కింది సంఖ్యలు రెండూ ఎక్కువవుతుంటాయి. కొందరికి కింది సంఖ్య పెరగకుండా పై సంఖ్య మాత్రమే పెరుగుతుంటుంది. దీన్నే సిస్టాలిక్ హైపర్‌టెన్షన్ అంటారు. ఎవరికైనా తరచూ రక్తపోటు హెచ్చుతగ్గులు అవుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. కారణమేంటన్నది గుర్తించటం చాలా కీలకం. రక్తపోటు హెచ్చుతగ్గులు 30 కన్నా ఎక్కువుంటే ప్రమాదకరంగా పరిణమించొచ్చు. హఠాత్తుగా రక్తపోటు తగ్గిపోయి, మూడు నాలుగు గంటల పాటు అలాగే ఉంటే కిడ్నీల మీద ప్రభావం చూపొచ్చు. ఉన్నట్టుండి రక్తపోటు పెరిగితే పక్షవాతం రావొచ్చు. ఎవరికైనా ముక్కులో రక్తనాళాలు చిట్లితే ఒకరకంగా అదృష్టమనే అనుకోవచ్చు. ఎందుకంటే ముక్కు రక్తనాళాలు చిట్లకపోతే మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి ఉండేవి మరి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే