పొడి చర్మానికి పరిమళ రక్ష

చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేయటంలో పరిమళ నూనెలు బాగా ఉపయోగపడతాయి. అయితే చర్మం తీరును బట్టే వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు- పొడి చర్మాన్నే తీసుకోండి. పొడి చర్మం ఉన్నంత మాత్రాన

Published : 23 Feb 2021 01:02 IST

ర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేయటంలో పరిమళ నూనెలు బాగా ఉపయోగపడతాయి. అయితే చర్మం తీరును బట్టే వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు- పొడి చర్మాన్నే తీసుకోండి. పొడి చర్మం ఉన్నంత మాత్రాన నూనె దట్టంగా పట్టించాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి నూనెలనైనా వాడుకోవచ్చని అనుకోవటానికీ లేదు. పొడి చర్మానికి బాదం నూనె, రోజ్‌హిప్‌ నూనెలు మేలు చేస్తాయి. బాదం నూనె చర్మంలో తేమనే కాదు, మృదుత్వాన్నీ పెంపొందిస్తుంది. ఇందులోని విటమిన్‌ ఎ, రెటినాల్‌ చర్మం కింది రక్తనాళాలను ప్రేరేపిస్తాయి. చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కండర పోచల (కొలాజెన్‌) ఉత్పత్తికీ దోహదం చేస్తాయి. ఎండుగజ్జి వంటి సమస్యలు తగ్గటానికీ బాదం నూనె ఉపయోగపడుతుంది. ఇక రోజ్‌హిప్‌ నూనెలో అత్యవసర కొవ్వు ఆమ్లాలన్నీ ఉంటాయి. అందువల్ల పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని చర్మం తేలికగానూ గ్రహించుకుంటుంది. ఇది తేమను పట్టి ఉంచుతుంది. అలాగే చర్మం ఎర్రబడటాన్నీ తగ్గిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు