చిన్న జాగ్రత్తలైనా..

కొందరు జీర్ణాశయంలోని ఆమ్లం ఛాతీలోకి ఎగదన్నుకొని రావటాన్నీ (జీఈఆర్‌డీ) గుండెనొప్పిగా పొరపడుతుంటారు. ఇది గుండె నొప్పి కాదని డాక్టర్‌ను కలిసి నిర్ధారణ చేసుకోవటంలో తప్పులేదు. తర్వాత ఛాతీలో మంట

Published : 04 May 2021 00:30 IST

కొందరు జీర్ణాశయంలోని ఆమ్లం ఛాతీలోకి ఎగదన్నుకొని రావటాన్నీ (జీఈఆర్‌డీ) గుండెనొప్పిగా పొరపడుతుంటారు. ఇది గుండె నొప్పి కాదని డాక్టర్‌ను కలిసి నిర్ధారణ చేసుకోవటంలో తప్పులేదు. తర్వాత ఛాతీలో మంట తగ్గటానికి తగిన మందులు వాడుకోవచ్చు. ఇలాంటివారు మందులు వేసుకోవటంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవటం ముఖ్యం. ఇది జీర్ణాశయం, అన్నవాహిక కలిసేచోట బిగుతుగా ఉండే కండర వలయం మరింత బిగువుగా ఉండేలా చేస్తుంది. అలాగే తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత కనీసం గంట వరకూ నిద్రకు ఉపక్రమించటం తగదు. నడుమును బిగుతుగా పట్టి ఉంచే దుస్తులకు బదులు వదులుగా ఉండేవి ధరించాలి. పడుకున్నప్పుడు తల కాస్త ఎత్తుగా ఉండేలా మరో దిండు వేసుకొని పడుకోవాలి. ఛాతీలో మంట కేవలం అసౌకర్యాన్ని కలిగించేదే కాదు, అన్నవాహికలో పుండ్లు (అల్సర్లు) పడేలా కూడా చేయొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని