గర్భధారణకు ప్రయత్నించొచ్చా?

సమస్య: నాకు 26 ఏళ్లు. మూడు వారాల కిందట కొవిడ్‌ వచ్చి, తగ్గింది. ప్రస్తుతం ఏ సమస్యలూ లేవు. ఇప్పుడు నేను గర్భధారణకు ప్రయత్నించొచ్చా? కొంతకాలం ఆగాలా?

Published : 01 Jun 2021 00:38 IST

సమస్య: నాకు 26 ఏళ్లు. మూడు వారాల కిందట కొవిడ్‌ వచ్చి, తగ్గింది. ప్రస్తుతం ఏ సమస్యలూ లేవు. ఇప్పుడు నేను గర్భధారణకు ప్రయత్నించొచ్చా? కొంతకాలం ఆగాలా?

- లక్ష్మి, హైదరాబాద్‌

సలహా: మీకు కొవిడ్‌ వచ్చి 3 వారాలే అయ్యిందని అంటున్నారు. ఈలోపు యాంటీబాడీలు అంతగా అభివృద్ధి చెందవు. కాబట్టి మీరు 2 నెలల తర్వాతే గర్భధారణకు ప్రయత్నించటం మంచిది. అప్పటికి యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయి. మున్ముందు ఎలాంటి సమస్యలు తలెత్తకపోవచ్చు. అలాగే టీకా వేయించుకోవటం మరవద్దు. దీంతో మరింత ఎక్కువ రక్షణ లభిస్తుంది. కొవిడ్‌ తగ్గిన 3 నెలల తర్వాత టీకా తీసుకోవాలని ప్రస్తుత మార్గదర్శకాలు చెబుతున్నాయి. అప్పటికి మీరు గర్భం ధరించినా టీకా వేయించుకోవటమే మంచిది.
 

-డా।। పి.బాలాంబ, సీనియర్‌ గైనకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని