రెండో మోతాదు వేరే టీకా తీసుకోవచ్చా?

నేను నెల కిందట కొవాగ్జిన్‌ తీసుకున్నాను. ఇప్పుడు రెండో మోతాదు టీకా తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కొవాగ్జిన్‌ అంతగా అందుబాటులో లేదని చెబుతున్నారు.

Published : 01 Jun 2021 00:38 IST

సమస్య: నేను నెల కిందట కొవాగ్జిన్‌ తీసుకున్నాను. ఇప్పుడు రెండో మోతాదు టీకా తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కొవాగ్జిన్‌ అంతగా అందుబాటులో లేదని చెబుతున్నారు. దీంతో రెండో మోతాదు సమయం మించిపోతోంది. ఇప్పుడేం చేయాలి? కొవిషీల్డ్‌ తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా?

- పి.జి.చారి, నల్గొండ

సలహా: మొదటిసారి ఏ టీకా తీసుకుంటే రెండోసారీ అదే తీసుకోవాలి. వేరే టీకా తీసుకోవద్దనే ప్రస్తుత మార్గదర్శకాలు చెబుతున్నాయి. రెండో మోతాదుగా వేరే టీకా తీసుకోవచ్చా? లేదా? అనే దానిపై ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. వీటి ఫలితాలు ఇంకా తేలలేదు. మీరు మొదటి మోతాదుగా కొవాగ్జిన్‌ తీసుకున్నారు. కాబట్టి రెండో మోతాదుగానూ అదే టీకా తీసుకోవాలి. నెల దాటినా ఇబ్బందేమీ లేదు. ఒక టీకాతోనూ 75% వరకు రక్షణ లభిస్తుంది. మీరు రెండు నెలల్లోపు ఎప్పుడైనా రెండో మోతాదు టీకా తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3 నెలల వరకు వేచి చూడొచ్చు. ఇలా ఆలస్యమైనప్పుడు రెండో మోతాదు టీకా తీసుకున్నాక 2-3 వారాల తర్వాత ఒకసారి యాంటీబాడీ పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకవేళ తగినంత సంఖ్యలో యాంటీబాడీలు పుట్టుకు రాకపోతే శాస్త్రీయంగానైతే నెల తర్వాత మూడో మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మూడో మోతాదు టీకాకు ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అన్నది తెలియదు.

-డా।। ఎం.వి.రావు, సీనియర్‌ ఫిజిషియన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని