జుట్టూడుతుంటే..

దువ్వుకుంటున్నప్పుడో,   స్నానం చేస్తున్నప్పుడో రోజూ కొన్ని వెంట్రుకలు రాలటం సహజమే. దీని గురించి పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. పెద్దమొత్తంలో రాలుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. పోషణలోపం, ఒత్తిడి, ఆందోళన వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చు. వెంట్రుకలు రాలటాన్ని పూర్తిగా ఆపలేకపోవచ్చు

Published : 08 Jun 2021 01:14 IST

దువ్వుకుంటున్నప్పుడో,   స్నానం చేస్తున్నప్పుడో రోజూ కొన్ని వెంట్రుకలు రాలటం సహజమే. దీని గురించి పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. పెద్దమొత్తంలో రాలుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. పోషణలోపం, ఒత్తిడి, ఆందోళన వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చు. వెంట్రుకలు రాలటాన్ని పూర్తిగా ఆపలేకపోవచ్చు గానీ తగ్గించుకునే అవకాశం లేకపోలేదు. తేలికైన షాంపూతో తరచూ తలస్నానం చేయటం, పూర్తిగా ఆరిన తర్వాతే తల దువ్వటం, బాదం నూనె వంటి పరిమళ తైలాలతో మాడును మర్దన చేయటం వంటివి ఉపయోగపడతాయి. గుడ్లు, పాలకూర, ఆల్‌బుకార పండ్లు, మజ్జిగ, పెరుగు తినటమూ మంచిదే. కంటి నిండా నిద్రపోవటం, ధ్యానం చేయటమూ మేలు చేస్తాయి. ఇవి జుట్టు పలచబారకుండా చూస్తాయి. వెంట్రుకలు పెరగటానికి తోడ్పడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని