రుచి వాసన తగ్గాయా?

రుచి, వాసన.. జీవితాన్ని ఆస్వాదించటానికివే మూలం! ఇవి లేకపోతే పూల పరిమళాన్ని ఆఘ్రాణించలేం. ఎంత కమ్మటి భోజనమైనా చప్పిడి కూడుగానే అనిపిస్తుంది. రుచి, వాసన ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. వాసన తెలియకపోతే రుచీ తగ్గుతుంది.

Published : 29 Jun 2021 01:10 IST

రుచి, వాసన.. జీవితాన్ని ఆస్వాదించటానికివే మూలం! ఇవి లేకపోతే పూల పరిమళాన్ని ఆఘ్రాణించలేం. ఎంత కమ్మటి భోజనమైనా చప్పిడి కూడుగానే అనిపిస్తుంది. రుచి, వాసన ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. వాసన తెలియకపోతే రుచీ తగ్గుతుంది. ఇవి ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండవు. వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గుతూ వస్తుంటాయి. కొన్ని వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతోనూ తగ్గుతాయి. కొవిడ్‌-19లో తాత్కాలికంగా రుచి, వాసన కోల్పోవటం చూస్తూనే ఉన్నాం. రేడియేషన్‌, క్యాన్సర్‌ చికిత్సలు తీసుకునే సమయంలోనూ ఇవి తగ్గుతుంటాయి. చికిత్స ఆపేశాక మామూలు స్థాయికి చేరుకుంటాయి. కొన్నిరకాల మందులూ రుచి, వాసనను దెబ్బతీస్తాయి. చిగుళ్ల జబ్బు వంటి నోటి ఇన్‌ఫెక్షన్లతోనూ రుచి మారిపోతుంది. రుచి, వాసన తగ్గటం కొన్నిసార్లు తీవ్ర జబ్బులకూ సంకేతాలు కావొచ్చు. ఉదాహరణకు- పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ జబ్బుల్లో వాసన సామర్థ్యం తగ్గుతుంది. ఏవైనా తేడాలను గమనిస్తే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లటం మంచిది. రుచి, వాసన తగ్గినప్పుడు ఆకర్షణీయంగా కనిపించే రంగురంగుల కూరగాయలు, పండ్లతో కొంతవరకు మేలు కలుగుతుంది. వంటకాలకు మసాలాలు జోడించటమూ మంచిదే. ఆవాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వంటివి వంటకాలకు మరింత రుచిని తెచ్చిపెడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు