గుండెకు ధ్యాన బలం!

గుండెపోటు వచ్చిందా? మానసిక ఒత్తిడి తలెత్తకుండా చూసుకోండి. దీంతో రెండోసారి గుండెపోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చని తేలింది. ఎమోరీ యూనివర్సిటీ పరిశోధకులు తొలిసారి గుండెపోటు బారినపడ్డ 283 మందిని ఎంచుకొని.. మానసిక ఒత్తిడికి సంకేతాలైన కుంగుబాటు,

Published : 13 Jul 2021 01:31 IST

గుండెపోటు వచ్చిందా? మానసిక ఒత్తిడి తలెత్తకుండా చూసుకోండి. దీంతో రెండోసారి గుండెపోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చని తేలింది. ఎమోరీ యూనివర్సిటీ పరిశోధకులు తొలిసారి గుండెపోటు బారినపడ్డ 283 మందిని ఎంచుకొని.. మానసిక ఒత్తిడికి సంకేతాలైన కుంగుబాటు, ఆందోళన, కోపం తీరుతెన్నులను పరిశీలించారు. ఐదేళ్లలో 80 మంది రెండోసారి గుండెపోటు బారినపడగా.. వీరిలో సగం మంది ఒత్తిడి స్థాయులు ఎక్కువగా ఉన్నవారే. వీరిలో రక్తనాళాల్లో పూడికలకు దోహదం చేసే వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇది రెండోసారి గుండెపోటు ముప్పు పెరిగేలా చేస్తోంది. మరి ఒత్తిడిని తగ్గించుకునేదెలా? ధ్యానం చేయటం ద్వారా. గుండెపోటు బాధితులు విధిగా ధ్యానం వంటి పద్ధతులను సాధన చేయాలని డాక్టర్లు ఇప్పటికే సూచిస్తుండటం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని