పిల్లి గీరితే?

పిల్లులు చూడటానికి ముద్దొస్తుండొచ్చు గానీ అవి భయపడినప్పుడో, ఆత్మరక్షణ కోసమో కరవచ్చు. గోళ్లతో గీరొచ్చు. వీటి పళ్లు, గోళ్లు వాడిగా ఉంటాయి కాబట్టి లోతైన గాయం కావొచ్చు. కొన్నిసార్లు కణజాలం, కండర బంధనాలూ చీరుకుపోవచ్చు.

Published : 27 Jul 2021 02:35 IST

పిల్లులు చూడటానికి ముద్దొస్తుండొచ్చు గానీ అవి భయపడినప్పుడో, ఆత్మరక్షణ కోసమో కరవచ్చు. గోళ్లతో గీరొచ్చు. వీటి పళ్లు, గోళ్లు వాడిగా ఉంటాయి కాబట్టి లోతైన గాయం కావొచ్చు. కొన్నిసార్లు కణజాలం, కండర బంధనాలూ చీరుకుపోవచ్చు. వీటి నోట్లో, గోళ్లలో బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. అందువల్ల పిల్లులు.. ముఖ్యంగా టీకా ఇప్పించని పిల్లులు కరిచినా, గీరినా సబ్బు, నీటితో శుభ్రంగా కడగాలి. యాంటీబయోటిక్‌ మలాము రాయాలి. శుభ్రమైన బ్యాండేజీని చుట్టాలి. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని