చుండ్రుకు జింక్‌

కాలమేదైనా కొందరికి చుండ్రు నిరంతరం వేధిస్తుంటుంది. దీన్ని పోగొట్టుకోవటానికి చాలామంది చేసే పని యాంటీ-డాండ్రఫ్‌ షాంపూలు వాడటం. దీంతో పాటు ఆహారం మీదా దృష్టి పెట్టటం మంచిది. ముఖ్యంగా జింక్‌తో కూడిన పదార్థాలు తినటం మేలు.

Published : 17 Aug 2021 02:08 IST

కాలమేదైనా కొందరికి చుండ్రు నిరంతరం వేధిస్తుంటుంది. దీన్ని పోగొట్టుకోవటానికి చాలామంది చేసే పని యాంటీ-డాండ్రఫ్‌ షాంపూలు వాడటం. దీంతో పాటు ఆహారం మీదా దృష్టి పెట్టటం మంచిది. ముఖ్యంగా జింక్‌తో కూడిన పదార్థాలు తినటం మేలు. మన మాడు మీద చాలా తైల గ్రంథులుంటాయి. వీటిలోంచి పుట్టుకొచ్చే నూనెలు (సీబమ్‌) మాడుకు రక్షణ కల్పిస్తుంటాయి. అలాగని ఇవి ఎక్కువగా ఉత్పత్తయినా కష్టమే. చుండ్రుకు దారితీయొచ్చు. సీబమ్‌ ఉత్పత్తిని నియంత్రించటానికి జింక్‌ తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదొక్కటే సరిపోదు. విటమిన్‌ బి6 కూడా అవసరమే. జింక్‌ను శరీరం బాగా గ్రహించుకోవటానికిది తప్పనిసరి. కాబట్టి కందులు, పెసలు, శనగలు, మినుముల వంటి పప్పులు.. బాదం, పిస్తా, అక్రోట్ల వంటి గింజ పప్పులు.. జొన్నలు, సజ్జలు, దంపుడు బియ్యం, పొట్టుతీయని గోధుమల వంటి ధాన్యాలు తరచూ తినేలా చూసుకోవాలి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని