ఆమ్లానికి అల్లం

అజీర్ణం, పులి తేన్పులు, ఛాతీలో మంట, కడుపునొప్పితో వేధించే అసిడిటీ సమస్యకు  ఆమ్లాన్ని తగ్గించే (యాంటాసిడ్‌) మందులు వేసుకుంటుంటారు. వీటిని దీర్ఘకాలం వాడితే విటమిన్‌ బి12, క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాల లోపానికి దారితీయొచ్చు.

Published : 17 Aug 2021 02:08 IST

జీర్ణం, పులి తేన్పులు, ఛాతీలో మంట, కడుపునొప్పితో వేధించే అసిడిటీ సమస్యకు  ఆమ్లాన్ని తగ్గించే (యాంటాసిడ్‌) మందులు వేసుకుంటుంటారు. వీటిని దీర్ఘకాలం వాడితే విటమిన్‌ బి12, క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాల లోపానికి దారితీయొచ్చు. ఫలితంగా గుండె వేగం అస్తవ్యస్తం కావటం, న్యుమోనియా, ఎముకలు గుల్లబారటం వంటి సమస్యలు తలెత్తొచ్చు. యాంటాసిడ్‌ మందులు జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి కాకుండా నిలువరిస్తాయి. ఇలా తాత్కాలికంగా నొప్పి, మంట వంటి లక్షణాలను తగ్గిస్తాయి. అసలు విషయం ఏంటంటే- తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే ఆమ్లం అత్యవసరం. ఇది తగ్గితే జీర్ణక్రియ అస్తవ్యస్తమవుతుంది. మరేంటి దారి? అసిడిటీ మామూలుగా ఉంటే కాస్త అల్లం టీ తాగి చూడండి. ఇది జీర్ణాశయం, పేగులు ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఆమ్లం పైకి ఎగదన్నుకు రాకుండా చూస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని