ఊబకాయానికి గుమ్మడి

అధిక బరువు తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండాలని భావిస్తున్నారా? బూడిద గుమ్మడి రసం తాగి చూడండి.

Updated : 24 Aug 2021 05:54 IST

ధిక బరువు తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండాలని భావిస్తున్నారా? బూడిద గుమ్మడి రసం తాగి చూడండి. ఇందులో కేలరీలు, పిండి పదార్థాలు తక్కువ. కాబట్టి మధుమేహులకు, ఊబకాయులకు బాగా ఉపయోగపడుతుంది. చలువ చేసే గుణం గల దీనితో శరీరానికి అవసరమైన లవణాలు, ఖనిజాలు, విటమిన్లు సైతం లభిస్తాయి. బూడిద గుమ్మడి రసం మూత్రం ఎక్కువ వచ్చేలా చేస్తుంది. ఇలా ఒంట్లోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోవటానికి తోడ్పడుతుంది. కాస్త విరేచనకారిగానూ పనిచేస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. గ్యాస్‌ ఉత్పత్తి చేయదు. అందువల్ల జీర్ణ సమస్యలు గలవారికి బాగా మేలు చేస్తుంది.
తీసుకోవటమెలా?: గుమ్మడి కాయ చెక్కు తీసి, ముక్కలు చేసి, మిక్సీలో వేసి.. కాస్త నీరు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. వడగట్టి రసం తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు