తేనె శక్తి

తేనెలో బోలెడన్ని ఔషధ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములను అణచివేయటానికిది ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే పుండ్లు, కాలిన గాయాలు మానటానికి చాలాకాలంగా వాడుతూనే ఉన్నారు....

Updated : 31 Aug 2021 06:45 IST

తేనెలో బోలెడన్ని ఔషధ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములను అణచివేయటానికిది ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే పుండ్లు, కాలిన గాయాలు మానటానికి చాలాకాలంగా వాడుతూనే ఉన్నారు. తేనెలో ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం దండిగా ఉంటాయి. అంతేకాదు.. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్‌ యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇవి ఒంట్లో వేటికీ అంటుకోకుండా విశృంఖలంగా సంచరించే కణాలను నిర్వీర్యం చేస్తాయి. తేనెలోని ఒకరకం చక్కెర (నైజెరూలిగోశాక్రైడ్లు) రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది టి, బి లింఫ్‌ కణాలు, యాంటీబాడీలు, ఈస్నోఫిల్స్‌, న్యూట్రోఫిల్స్‌, మోనోసైట్స్‌, హానికారక సూక్ష్మక్రిములను తుదముట్టించే సహజ హంతక కణాలు వృద్ధి చెందటానికీ దోహదం చేస్తుంది. సూక్ష్మక్రిములను చంపటమే కాదు.. కణితులు వృద్ధి చెందకుండానూ కాపాడుతుంది. అల్పాహారానికి ముందు గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. రోగనిరోధకశక్తి ఇనుమడిస్తుంది. ఒంట్లోని విషతుల్యాలూ బయటకు వెళ్లిపోవటానికి వీలుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని