మనసు కుదురుగా

అప్పుడే ఉత్సాహం. అంతలోనే నిరుత్సాహం. ఇదో చిత్రమైన మానసిక స్థితి. దీన్నే బైపోలార్‌ డిజార్డర్‌ అంటారు. ఇలాంటివారికి కొవ్వు ఆమ్లాలతో కూడిన పదార్థాలను మార్చుకోవటం...

Published : 28 Sep 2021 01:49 IST

ప్పుడే ఉత్సాహం. అంతలోనే నిరుత్సాహం. ఇదో చిత్రమైన మానసిక స్థితి. దీన్నే బైపోలార్‌ డిజార్డర్‌ అంటారు. ఇలాంటివారికి కొవ్వు ఆమ్లాలతో కూడిన పదార్థాలను మార్చుకోవటం ఉపయోగపడగలదని పెన్‌ స్టేట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం సూచిస్తోంది. ఆహారంలో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలతో కూడిన మాంసం, గుడ్లు, కొన్నిరకాల నూనెలను పరిమతంగా.. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో నిండిన టూనా, సాల్మన్‌ వంటి చేపలు.. అవిసె గింజలు అధికంగా తీసుకోవటం మేలు చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. జీవక్రియల్లో పాలు పంచుకునే లాక్టిక్‌ యాసిడ్‌ వంటివి ఉత్పత్తి కావటానికి ఇలాంటి ఆహార పద్ధతి తోడ్పడుతున్నట్టు.. ఇవి మానసిక స్థితి మెరుగు పడటానికి దోహదం చేస్తున్నట్టు కనుగొన్నారు. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు గానీ బైపోలార్‌ డిజార్డర్‌ లక్షణాలు అదుపులో ఉండటానికి ఉపయోగపడగలదని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని