పగటి వెలుగు రాత్రి నిద్ర!

రాత్రిపూట నిద్ర సరిగా పట్టటం లేదా? అయితే ఇంట్లో పగటిపూట వెలుతురు బాగా పడేలా చూసుకోండి. ఇది మన జీవగడియారం సజావుగా పనిచేయటానికి, నిద్ర బాగా....

Updated : 28 Sep 2021 01:50 IST

రాత్రిపూట నిద్ర సరిగా పట్టటం లేదా? అయితే ఇంట్లో పగటిపూట వెలుతురు బాగా పడేలా చూసుకోండి. ఇది మన జీవగడియారం సజావుగా పనిచేయటానికి, నిద్ర బాగా పట్టటానికి, మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి సాయం చేస్తున్నట్టు ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం పేర్కొంటోంది. పగటిపూట కిటికీలను మందమైన కర్టెన్లు, బ్లైండ్స్‌తో మూసి ఉంచితే ఒక వారంలోనే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి 15 నిమిషాలు ఆలస్యమవుతున్నట్టు.. ఇది నిద్ర ఆలస్యంగా పట్టటానికి, తక్కువసేపు నిద్రపోవటానికి దారితీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అదే పగటి వెలుగు బాగా పడేలా చూసుకుంటే నిద్ర త్వరగా పట్టటంతో పాటు ఆందోళన, ఒత్తిడి కూడా తగ్గుతుండటం గమనార్హం. పగటి వెలుగు.. ముఖ్యంగా సహజ వెలుతురుతో విషయ గ్రహణ సామర్థ్యమూ పుంజుకుంటున్నట్టు గత అధ్యయనాలు పేర్కొంటున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని