టీకా తీసుకోకపోతే గర్భిణులకు చేటే

మనదేశంలో గర్భిణులకూ కొవిడ్‌ టీకా ఇస్తున్నారు. అయినా కొందరు సురక్షితం కాదనే భయంతో టీకా తీసుకోవటానికి వెనకాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని, టీకా తీసుకోని గర్భిణులకు జబ్బు తీవ్రమయ్యే ప్రమాదముందని..

Published : 05 Oct 2021 00:19 IST

నదేశంలో గర్భిణులకూ కొవిడ్‌ టీకా ఇస్తున్నారు. అయినా కొందరు సురక్షితం కాదనే భయంతో టీకా తీసుకోవటానికి వెనకాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని, టీకా తీసుకోని గర్భిణులకు జబ్బు తీవ్రమయ్యే ప్రమాదముందని.. ఇది పిండానికీ హాని చేయొచ్చని యూటీ సౌత్‌వెస్టర్న్‌ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనం పేర్కొంటోంది. గత సంవత్సరంతో పోలిస్తే కొవిడ్‌-19 బారినపడ్డ గర్భిణులు ఆసుపత్రిలో చేరటం ఇటీవల ఎక్కువైందని, వీరిలో అత్యధిక శాతం మంది టీకా తీసుకోనివారేనని పరిశోధకులు చెబుతున్నారు. మామూలుగానే గర్భిణులకు తీవ్ర శ్వాసకోశ జబ్బులతో తలెత్తే దుష్ప్రభావాల ముప్పు ఎక్కువ. కొవిడ్‌-19 సైతం ఇలాంటిదే. ఇది ఇంకాస్త తీవ్రంగానూ దాడిచేస్తోంది. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులంతా టీకా తీసుకోవటమే ఉత్తమమని సూచిస్తున్నారు. డెల్టా వైరస్‌ దాడి చేస్తున్న నేపథ్యంలో ఇది మరింత అవసరమని గుర్తుచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని