ఇది టీకా దురదా?

కొవిడ్‌ మొదటి టీకా తీసుకున్నాక మా వదిన(31)కు ఒక సమస్య మొదలైంది. మాంసాహారం తిన్న ప్రతిసారి దురద వస్తోంది. ఇది ఇంతటితో ఆగిపోతుందా? ఇతరత్రా సమస్యలేవైనా వస్తాయా? రెండో మోతాదు టీకా వేయించుకోవచ్చా?....

Updated : 05 Oct 2021 07:17 IST

సమస్య: కొవిడ్‌ మొదటి టీకా తీసుకున్నాక మా వదిన(31)కు ఒక సమస్య మొదలైంది. మాంసాహారం తిన్న ప్రతిసారి దురద వస్తోంది. ఇది ఇంతటితో ఆగిపోతుందా? ఇతరత్రా సమస్యలేవైనా వస్తాయా? రెండో మోతాదు టీకా వేయించుకోవచ్చా?

- బాలమణి, హైదరాబాద్‌

సలహా: కొవిడ్‌ టీకాకు మీరు చెబుతున్న సమస్యకు సంబంధం ఉండి ఉండకపోవచ్చు. ఒకవేళ టీకా దుష్ప్రభావమైతే తీసుకున్న వెంటనే  దురద వచ్చి ఉండాలి. మీ వదినకు మాంసాహారం తిన్నప్పుడే దురద వస్తోందని అంటున్నారు. దీనికి టీకాతో సంబంధం లేదనే అనిపిస్తోంది. టీకా దుష్ప్రభావాలైతే తీసుకున్న రెండు మూడు రోజుల వరకే ఉంటాయి.  ఇలా ఎక్కువ కాలం వేధించవు. కాబట్టి రెండో మోతాదు టీకా నిరభ్యంతరంగా ఇప్పించొచ్చు. ఒకవేళ మీకు అంత అనుమానంగా ఉన్నట్టయితే టీకా తీసుకునేందుకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బందికి ఈ విషయాన్ని ముందే చెప్పండి. టీకా ఇచ్చాక దురద వస్తుందేమో గమనిస్తారు. ఏదైనా సమస్య తలెత్తితే ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని