Immunity Tips: రోగనిరోధక శక్తి కోసం శృంగారం!
మీ జీవనకాలాన్ని (Lifespan) మరో 20 ఏళ్లు పొడిగించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇమ్యూనిటీ (Immunity) పెంచుకుని ఆరోగ్యంగా ఉండండి. దాని కోసం మీరు పాటిస్తున్న అలవాట్లకు శృంగారం (Sex) కూడా జోడించండి అని నిపుణులు చెబుతున్నారు.
ఆయుష్షు (Lifespan) పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి?
- పొగ (Smoking) మానెయ్యాలి. రోజూ వ్యాయామం (Exercise) చేయాలి. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తినాలి. రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి. మద్యం (Alcohol)అతిగా తాగొద్దు. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో భావోద్వేగ సాన్నిహిత్యం కలిగుండాలి.
ఈ జాబితాకు శృంగారాన్ని (Sex) కూడా జోడించుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇది జీవనకాలాన్ని 20 ఏళ్ల వరకు పొడిగించొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరణించే ముప్పును సగానికి తగ్గించొచ్చనీ మరికొన్ని సూచిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శృంగారమనేది భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలమూ ఇనుమడిస్తుంది. ఫలితంగా కుంగుబాటు, దిగులు దరిజేరవు. శృంగారం వ్యాయామంగానూ ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందన్న సంగతి తెలిసిందే.
తరచూ శృంగారంతో రోగనిరోధకశక్తీ బలోపేతమవుతుంది. వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ (ఐజీఏ) మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు వైక్స్ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఐజీఏ కీలక పాత్ర పోషిస్తుంది. మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? వ్యాయామం వంటి వాటితో పాటు తిండి మీదా కాస్త శ్రద్ధ పెట్టాలి.
- సోయా, చేపల వంటివి సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.
- పలుచటి ప్రొటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిల్లో టైరోసైన్, ఫినైల్‌అలనైన్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి.
- తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటివాటిల్లో కొలైన్ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే.
- పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్‌కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్‌ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో