కంటికి కాలుష్యం సెగ

వృద్ధాప్యంలో కంట్లోని రెటీనా మధ్యభాగం (మ్యాక్యులా) క్షీణించే సమస్యకు (ఏఎండీ) రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. వయసు, పొగ అలవాటు, కుటుంబంలో ఎవరికైనా ఏఎండీ ఉండటం వంటివన్నీ ఇందులో పాలు ...

Published : 02 Nov 2021 02:23 IST

వృద్ధాప్యంలో కంట్లోని రెటీనా మధ్యభాగం (మ్యాక్యులా) క్షీణించే సమస్యకు (ఏఎండీ) రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. వయసు, పొగ అలవాటు, కుటుంబంలో ఎవరికైనా ఏఎండీ ఉండటం వంటివన్నీ ఇందులో పాలు పంచుకునేవే. దీనికి వాతావరణ కాలుష్య ప్రభావమూ కారణమవుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. పరిశోధకులు ఎలాంటి కంటి సమస్యలు లేని 40-69 ఏళ్ల వయసువారిని ఆరేళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారికి మ్యాక్యులా క్షీణించే ముప్పు 8% ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. వీరి కళ్లలో కొన్నిరకాల మార్పులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్టు, ఇవి ఏఎండీకి దారితీస్తున్నట్టు కూడా తేలింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని