ఎముకకు గురక శాపం

గురకను తేలికగా తీసుకోవద్దు. ఇది ఎముకలనూ దెబ్బతీస్తుంది. నిద్రలో ఉన్నట్టుండి కాసేపు శ్వాస ఆగిపోయే (స్లీప్‌ అప్నియా) మహిళలకు ఎముకలు విరిగే ముప్పు 2 రెట్లు ఎక్కువని తేలింది మరి. స్లీప్‌ అప్నియా...

Published : 02 Nov 2021 02:23 IST

గురకను తేలికగా తీసుకోవద్దు. ఇది ఎముకలనూ దెబ్బతీస్తుంది. నిద్రలో ఉన్నట్టుండి కాసేపు శ్వాస ఆగిపోయే (స్లీప్‌ అప్నియా) మహిళలకు ఎముకలు విరిగే ముప్పు 2 రెట్లు ఎక్కువని తేలింది మరి. స్లీప్‌ అప్నియా గలవారిలో నిద్ర పోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో గురక వస్తుంది. కొన్నిసార్లు శ్వాస ఆడక ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. ఇప్పటివరకూ దీంతో గుండెజబ్బు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పులు పెరుగుతాయనే భావిస్తుండేవారు. తాజాగా ఎముకల మీదా దీని ప్రభావం పడుతున్నట్టు బయటపడింది. కాబట్టి గురక వస్తుంటే ఎముకల ఆరోగ్యం గురించి డాక్టర్‌తో చర్చించటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని