నడుం నొప్పికి మార్జాలాసనం

నిశితంగా గమనిస్తే పెంపుడు జంతువుల నుంచీ ఎంతో నేర్చుకోవచ్చు. మార్జాలాసనం అలాంటిదే. శరీరాన్ని పిల్లిలా సాగదీసే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Updated : 09 Nov 2021 01:01 IST

నిశితంగా గమనిస్తే పెంపుడు జంతువుల నుంచీ ఎంతో నేర్చుకోవచ్చు. మార్జాలాసనం అలాంటిదే. శరీరాన్ని పిల్లిలా సాగదీసే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎలా చేయాలి?

* ముందుగా వజ్రాసనం వేసి కూర్చోవాలి. శరీరాన్ని ముందుకు వంచుతూ మోకాళ్లు, అరచేతులు నేలకు ఆనించాలి. అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటికి  సమాంతరంగా ఉండాలి.

* నెమ్మదిగా శ్వాస వదులుతూ.. నడుమును వీలైనంత పైకి లేపాలి. తలను కొద్దిగా కిందికి దింపాలి. కాసేపు అలాగే ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ.. నడుమును కిందికి వంచుతూ, తలను పైకి ఎత్తాలి. కాసేపు అలాగే ఉండాలి.

- ఇలా ఐదారు సార్లు చేయాలి.

ఇవీ ప్రయోజనాలు

* వెన్నెముక వదులవుతుంది. చురుకుదనం పెరుగుతుంది. నడుము నొప్పి తగ్గుతుంది. మణికట్టు, భుజాలు బలోపేతమవుతాయి. జీర్ణకోశ అవయవాలకు మర్దన లభిస్తుంది. జీర్ణక్రియ పుంజుకుంటుంది. కడుపు కండరాలు బిగువుగా అవుతాయి. కడుపులోని కొవ్వు తగ్గుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని