Diabetes: మధుమేహమా? ఒత్తిడి తగ్గించుకోండి

రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఒత్తిడినీ తగ్గించుకోండి. మానసిక ఒత్తిడి మూలంగా కార్టిజోల్‌, అడ్రినలిన్‌ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తంలో కలిసే సమయంలో కాలేయం ...

Updated : 09 Nov 2021 07:29 IST

క్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఒత్తిడినీ తగ్గించుకోండి. మానసిక ఒత్తిడి మూలంగా కార్టిజోల్‌, అడ్రినలిన్‌ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తంలో కలిసే సమయంలో కాలేయం తాను నిల్వ ఉంచుకున్న గ్లూకోజునూ (గ్లైకోజెన్‌) విడుదల చేస్తుంది. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. మధుమేహులకు, ఇన్సులిన్‌ నిరోధకత (కణాలు ఇన్సులిన్‌కు స్పందించకపోవటం) గలవారికిది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఒత్తిడితో భావోద్వేగాలూ గతి తప్పుతాయి. దీంతో నిద్ర సరిగా పట్టకపోవచ్చు. మరింత ఎక్కువగానూ తింటుండొచ్చు. వ్యాయామాలనూ పక్కన పెడుతుండొచ్చు. ఇవన్నీ రక్తంలో గ్లూకోజు పెరిగేలా చేసేవే. కాబట్టి గాఢంగా, నెమ్మదిగా శ్వాస తీసుకోవటం.. ధ్యానం చేయటం వంటివి రోజులో భాగం చేసుకోవటం మంచిది. ఇవి మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఫలితంగా గ్లూకోజూ అదుపులో ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని