కొవిడ్‌ బాధితులకు హెపారిన్‌ మేలు

కొవిడ్‌-19 ఊపిరితిత్తుల సమస్యే కాదు. ఒంట్లో అన్ని వ్యవస్థల మీదా ప్రభావం చూపుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డలకూ దారితీస్తుంది. ఇది పక్షవాతం, గుండెపోటు, కాలి సిరల్లో రక్తం గడ్డల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. అందుకే రక్తాన్ని పలుచబరచే మందులు కొవిడ్‌ చికిత్సలో

Updated : 23 Nov 2021 06:42 IST

కొవిడ్‌-19 ఊపిరితిత్తుల సమస్యే కాదు. ఒంట్లో అన్ని వ్యవస్థల మీదా ప్రభావం చూపుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డలకూ దారితీస్తుంది. ఇది పక్షవాతం, గుండెపోటు, కాలి సిరల్లో రక్తం గడ్డల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. అందుకే రక్తాన్ని పలుచబరచే మందులు కొవిడ్‌ చికిత్సలో మొదట్నుంచీ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవి రక్తం గడ్డలు ఏర్పడకుండానే కాదు, కొవిడ్‌ త్వరగా తగ్గటానికీ తోడ్పడుతుండటం గమనార్హం. ముఖ్యంగా లో-మాలిక్యులర్‌-వెయిట్‌ హెపరిన్‌ రకం మందులు వాడనివారితో పోలిస్తే వీటిని వాడినవారు సగటున నాలుగు రోజుల ముందుగానే కోలుకుంటున్నట్టు మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వియెన్నా పరిశోధకులు గుర్తించారు. కరోనా వైరస్‌ మీద, ఇది నిర్వీర్యం కావటం మీద ఈ మందులు నేరుగా ప్రభావం చూపుతున్నట్టు తేలటం ఆశ్చర్యకరమైన విషయమని పరిశోధకులు చెబుతున్నారు. వీటికి కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 మన కణాలకు అంటుకుపోకుండా నిలువరించే గుణముందని, ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా కాపాడుతున్నట్టు ప్రయోగాత్మక పరిశీలనలో తేలిందని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని