దురద గుట్టు

దురద పెడుతున్నప్పుడు గోకితే హాయిగానే అనిపిస్తుంది. తర్వాతే దద్దు, మంట ఇబ్బంది పెడతాయి. అసలు దురద ఎందుకు పెడుతుంది?  అసలు దురద పెడుతున్నప్పుడు చర్మంలో ఏం జరుగుతుంది? వీటి లోగుట్టును యూఎన్‌సీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌,

Updated : 30 Nov 2021 05:50 IST

దురద పెడుతున్నప్పుడు గోకితే హాయిగానే అనిపిస్తుంది. తర్వాతే దద్దు, మంట ఇబ్బంది పెడతాయి. అసలు దురద ఎందుకు పెడుతుంది?  అసలు దురద పెడుతున్నప్పుడు చర్మంలో ఏం జరుగుతుంది? వీటి లోగుట్టును యూఎన్‌సీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఛేదించారు. మన కణాల మీద గ్రాహక ప్రొటీన్లుంటాయి. వీటిని ఒకరకంగా తాళాలతో పోల్చుకోవచ్చు. ఏదైనా రసాయన ‘తాళంచెవి’ వీటిల్లోకి ప్రవేశించిందనుకోండి. అది కణాలను తెరవటమే కాదు. కణాల్లోపల గొలుసుకట్టు సంకేతాలనూ సృష్టిస్తుంది. దురదకు మూలం ఇదే. మాస్ట్‌ కణాల మీదుండే ఎంఆర్‌జీపీఆర్‌ఎక్స్‌2, దురదను గుర్తించే నాడీకణాల మీదుండే ఎంఆర్‌జీపీఆర్‌ఎక్స్‌4 గ్రాహకాలు ఇందులో పాలు పంచుకుంటాయి. రసాయనాలు వీటిల్లోకి ప్రవేశించినప్పుడు హిస్టమైన్లు విడుదలై, దురదకు కారణమవుతాయి. ఎండుగజ్జి, పెద్దపేగులో పుండ్లు,  నొప్పులకు సంబంధించిన వాపు ప్రక్రియలోనూ ఈ గ్రాహకాలు పాలు పంచుకుంటున్న నేపథ్యంలో తమ అధ్యయన ఫలితాలు కొత్త మందుల రూపకల్పనకు దారితీయగలదని పరిశోధకులు భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని