జీర్ణశక్తికి యోగముద్రాసనం

ఆకలి, జీర్ణశక్తి పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే యోగముద్రాసనం వేసి చూడండి.  ఇది కాస్త కష్టమైనదే అయినా సాధన చేస్తుంటే క్రమంగా అలవడుతుంది. దీంతో కడుపు కండరాలు, కటి భాగంలోని అవయవాలు బలోపేతమవుతాయి. మలబద్ధకమూ తొలగుతుంది. నాడీ వ్యవస్థ పుంజుకుంటుంది. తల, ముఖంలోని నాడులకు విశ్రాంతి లభిస్తుంది.  లైంగిక గ్రంథులూ బలోపేతమవుతాయి.

Updated : 30 Nov 2021 05:48 IST

ఎలా వేయాలి?
ముందుగా పద్మాసనం వేయాలి. నడుమును తిన్నగా ఉంచి, కూర్చోవాలి.
చేతులను వీపు వెనక్కి తీసుకురావాలి.
ఎడమ మణికట్టును కుడిచేత్తో పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి గాఢంగా శ్వాస తీసుకోవాలి.
శ్వాసను నెమ్మదిగా వదులుతూ తలను వంచుతూ, ముందుకు వంగాలి.
చేతులను వెనక వైపున అలాగే పట్టుకొని ఉండాలి.
క్రమంగా ముక్కు, నుదురును నేలకు తాకించేందుకు ప్రయత్నించాలి.
తర్వాత శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ తలను లేపుతూ యథాస్థితికి రావాలి.

వీరికి కూడదు
గర్భిణులు, నెలసరి అవుతున్నవారు.. సయాటికా, వెన్ను, భుజాలు, చేతులు, ఛాతీ పైభాగంలో నొప్పులు గలవారు.. వెన్ను, కీళ్ల సమస్యలతో బాధపడేవారు దీన్ని వేయరాదు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని