చిగుళ్ల జబ్బుతో ముందే కాన్పు

తల్లి కాబోతున్నారా? అయితే నోటి ఆరోగ్యం మీదా శ్రద్ధ పెట్టండి. చిగుళ్ల వాపు (జింజివైటిస్‌) మూలంగా నెలలు నిండకముందే కాన్పయ్యే ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ అధ్యయనం పేర్కొంటోంది. సాధారణంగా గర్భం ధరించినప్పుడు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి.

Published : 11 Jan 2022 00:59 IST

ల్లి కాబోతున్నారా? అయితే నోటి ఆరోగ్యం మీదా శ్రద్ధ పెట్టండి. చిగుళ్ల వాపు (జింజివైటిస్‌) మూలంగా నెలలు నిండకముందే కాన్పయ్యే ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ అధ్యయనం పేర్కొంటోంది. సాధారణంగా గర్భం ధరించినప్పుడు రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరికి చిగుళ్లకు, దంతాలకు మధ్య గార పేరుకొని చిగుళ్ల వాపు సైతం తలెత్తొచ్చు. దీని మూలంగా పుట్టుకొచ్చే వాపు కారక సూచికలు, అక్కడ పేరుకునే బ్యాక్టీరియా రక్తం ద్వారా మాయకు చేరుకునే అవకాశముందనీ పరిశోధకులు గుర్తించారు. ఇది వివిధ సమస్యలకు దారితీస్తుంది. నెలలు నిండకముందే కాన్పయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే గర్భధారణ సమయంలో నోరు శుభ్రంగా ఉంచుకోవటం ముఖ్యం. మనదగ్గర సుమారు 70% గర్భిణులు చిగుళ్ల జబ్బుతో బాధపడుతుంటారని అంచనా. ఇది గర్భిణి మధుమేహం, గుండె, కిడ్నీ జబ్బుల వంటి వాటికీ దోహదం చేస్తుంది. కాబట్టి చిగుళ్ల వాపు సూచనలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తగు చికిత్స తీసుకోవటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని