విటమిన్‌ సి అతిగా వద్దు

జలుబు లక్షణాలు కనిపించగానే కొందరు విటమిన్‌ సి మాత్రలను కొనుక్కొని వేసుకుంటుంటారు. ఇది జలుబు తగ్గటానికి తోడ్పడుతుందని చాలామంది నమ్మకం. మన శరీరానికి అవసరమైన ముఖ్య విటమిన్లలో విటమిన్‌ సి ఒకటి. నీటిలో

Published : 18 Jan 2022 00:26 IST

జలుబు లక్షణాలు కనిపించగానే కొందరు విటమిన్‌ సి మాత్రలను కొనుక్కొని వేసుకుంటుంటారు. ఇది జలుబు తగ్గటానికి తోడ్పడుతుందని చాలామంది నమ్మకం. మన శరీరానికి అవసరమైన ముఖ్య విటమిన్లలో విటమిన్‌ సి ఒకటి. నీటిలో కరిగే విటమిన్ల రకానికి చెందిన ఇది యాంటీ ఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే విటమిన్‌ సి జలుబు వైరస్‌లను అడ్డుకుంటున్నట్టు కచ్చితంగా నిరూపణ కాలేదు. జలుబు తగ్గటంలో దీని ప్రభావం అంతంతేనని పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా మనం తినే ఆహారంతోనే ఇది లభిస్తుంది. రోజుకు 4-6 సార్లు పండ్లు, కూరగాయలు తింటే చాలు. రోజుకు మనకు 65-100 మిల్లీగ్రాముల విటమిన్‌ సి అవసరం. దీన్ని 2,000 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా తీసుకుంటే వికారం, వాంతులు, విరేచనాలు, కిడ్నీలో రాళ్లు, ఛాతీలో మంట, కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు