నిద్రకు ఉప్పు భంగం!

రాత్రిపూట నిద్ర సరిగా పట్టాలని కోరుకుంటున్నారా? తెల్లారి హుషారుగా ఉండాలని భావిస్తున్నారా? అయితే భోజనంలో ఉప్పు తగ్గించుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తినటానికీ రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవటానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటోంది.

Updated : 15 Mar 2022 06:15 IST

రాత్రిపూట నిద్ర సరిగా పట్టాలని కోరుకుంటున్నారా? తెల్లారి హుషారుగా ఉండాలని భావిస్తున్నారా? అయితే భోజనంలో ఉప్పు తగ్గించుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తినటానికీ రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవటానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటోంది. ఉప్పు మూలంగా రక్తపోటు పెరగటం, ఒంట్లోంచి నీరు సరిగా బయటకు వెళ్లకపోవటమే దీనికి కొంతవరకు కారణం. ఉప్పు ఎక్కువగా తినటం రక్తపోటు పెరిగేలా చేస్తుంది. అందుకే డాక్టర్లు రోజు మొత్తమ్మీద చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని సూచిస్తుంటారు. ఒక చెంచాడు ఉప్పులో 2,300 మి.గ్రా. సోడియం ఉంటుంది. ఇంతకన్నా తక్కువ తీసుకున్నా మేలే. రోజుకు 1,500 మి.గ్రా. కన్నా సోడియం మించకుండా చూసుకుంటే మరింత మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కానీ మనలో చాలామంది రోజుకు సగటున 3,400 మి.గ్రా. కన్నా ఎక్కువగానే సోడియం తీసుకుంటున్నట్టు అంచనా. మనం వండుకునే కూరల్లోనే కాదు.. నిల్వ పచ్చళ్లు, బజ్జీలు, పకోడీల వంటి చిరుతిళ్లలోనూ ఉప్పు ఉంటుందనే సంగతి మరవరాదు. రోజువారీ ఉప్పు వాడకంలో వీటిని కూడా చేర్చుకొని లెక్కించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని