మలంలో రక్తం పడితే?
మలంలో రక్తం పడటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. అన్నవాహిక దగ్గర్నుంచి మలద్వారం వరకు జీర్ణకోశంలో ఎక్కడ రక్తస్రామైనా అది మలంతో కలిసి బయటకు రావొచ్చు. రక్తం ముదురుగా, నల్లగా ఉంటే చాలావరకు అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు మొదటి భాగంలో రక్తస్రావానికి సంబంధించింది అయ్యింటుంది. అదే బాగా ఎర్రగా ఉన్నట్టయితే పెద్దపేగు, మలాశయం, మలద్వారం నుంచి రక్తం వస్తుందని అనుకోవచ్చు. చాలామందిలో మొలలు (హెమరాయిడ్లు), మలద్వార వద్ద చీలికల (ఫిషర్స్) మూలంగానే మలంలో రక్తం పడుతుంటుంది. మొలలకు కారణం మలాశయం దిగువన, మలద్వారం చుట్టూ సిరలు ఉబ్బటం. విసర్జన సమయంలో ఇవి చిట్లిపోయి రక్తం స్రవిస్తుంది. ఫిషర్స్లో పొడవుగా, గట్టిగా మలం బయటకు వస్తున్నప్పుడు మలద్వారం వద్ద కణజాలం చీరుకుపోయి రక్తం పడుతుంది. పెద్దపేగులో చిన్న చిన్న తిత్తులు ఏర్పడి, అవి ఉబ్బిపోవటం (డైవర్టిక్యులోసిస్).. పేగు పూత (ఐబీడీ) మూలంగానూ మలంలో రక్తం పడొచ్చు. కొన్నిసార్లు పెద్దపేగు, మలద్వార క్యాన్సర్లలోనూ రక్తస్రావం కావొచ్చు. కాబట్టి మలంలో రక్తం పడటాన్ని నిర్లక్ష్యం చేయరాదు. దీనికి చాలాసార్లు మొలల వంటి మామూలు సమస్యలే కారణం కావొచ్చు గానీ క్యాన్సర్ల వంటి తీవ్ర సమస్యలనూ కొట్టి పారేయలేం. వీటిని ముందే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Stock Market Update: ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Politics News
Raghurama: నా శ్రేయోభిలాషుల కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నా: రఘురామ
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Related-stories News
Amarnath yatra: సైనికుల సాహసం.. 4 గంటల్లోనే వంతెన నిర్మాణం
-
Politics News
Raghurama: ఆ జాబితాలో నా పేరు లేదు.. పర్యటనకు రాలేను: మోదీకి రఘురామ లేఖ
-
Related-stories News
భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!