కొలనోస్కోపీ ముందు నుంచే..

పెద్దపేగు క్యాన్సర్లను గుర్తించే కొలనోస్కోపీ పరీక్షను ఇంకాస్త ముందు నుంచే ఆరంభించటం మంచిదని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ అధ్యయనం పేర్కొంటోంది. మహిళల్లో 50 ఏళ్లకు ముందే పరీక్షలు ఆరంభిస్తే పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు 50-60%...

Published : 10 May 2022 01:04 IST

పెద్దపేగు క్యాన్సర్లను గుర్తించే కొలనోస్కోపీ పరీక్షను ఇంకాస్త ముందు నుంచే ఆరంభించటం మంచిదని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ అధ్యయనం పేర్కొంటోంది. మహిళల్లో 50 ఏళ్లకు ముందే పరీక్షలు ఆరంభిస్తే పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు 50-60% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 60 ఏళ్లు వచ్చేసరికి క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గటం విశేషం. మగవారిలోనూ ఇలాంటి ఫలితాలే కనిపించే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు