పొగ అలవాటుతో ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రం
సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చేవారికి క్యాన్సర్ల ముప్పు ఎక్కువ. విచిత్రంగా పొగతాగే మగవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రోస్టేట్ గ్రంథి లోపల తలెత్తే క్యాన్సర్లకే వర్తిస్తున్నట్టు స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. అంతేకాదు, పొగతాగేవారికి ప్రోస్టేట్ క్యాన్సర్‌తో మరణించే ముప్పు చాలా ఎక్కువగా ఉంటున్నట్టూ బయటపడింది. జబ్బు నిర్ధరణ అయినప్పుడు కణితి సైజుతో సంబంధం లేకుండా మరణించే ముప్పు అధికంగా ఉంటుండటం గమనార్హం. ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడ్డవారిలో పొగ తాగనివారితో పోలిస్తే- పొగతాగే వారికి మరణించే ముప్పు 20% ఎక్కువగా ఉంటోంది. అధిక బరువు (శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి 25-30), ఊబకాయం (శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి 30 కన్నా ఎక్కువ) గలవారికి ఈ ముప్పు మరింత ఎక్కువవుతోంది కూడా. పొగతాగే అలవాటు గలవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చాక ఎందుకింత తీవ్రమవుతోందనేది తెలియరాలేదు. అందుకే దీని కారణాన్ని గుర్తించాల్సిన అవసరముందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Devendra Fadnavis: అవును.. మాది ‘ఈడీ’ ప్రభుత్వమే..!
-
Sports News
IND vs ENG: నాలుగో రోజు తొలి సెషన్ పూర్తి.. టీమ్ఇండియా ఆధిక్యం 361
-
Movies News
Bimbisara: చరిత్రలోకి తీసుకెళ్లేలా ‘బింబిసార’ ట్రైలర్.. కల్యాణ్‌రామ్ రాజసం చూశారా!
-
Politics News
Telangana News: కాంగ్రెస్ గూటికి తెరాస మేయర్.. రాహుల్ సమక్షంలో చేరిక
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Turkey: టర్కీ అదుపులో రష్యా ధాన్యం రవాణా నౌక
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!