విటమిన్ మాత్రలు ఎవరికి?
బలం వస్తుందనే భావనతో కొందరు విటమిన్ మాత్రలు వేసేసుకుంటుంటారు. నిజానికివి ఆహారానికి ప్రత్యామ్నాయం కావు. ఆరోగ్యంగా ఉండి, రకరకాల ఆహార పదార్థాలు తినేవారికి వీటితో ఉపయోగముండదు. కానీ కొందరికి మాత్రం అవసరం.
* వృద్ధులకు: వయసు మీద పడుతున్నకొద్దీ ఆహారాన్ని నమలటంలో, మింగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. మొత్తంగా ఆహారమే సరిగా తీసుకోక పోవచ్చు. ఇది పోషణ లోపానికి దారితీస్తుంది. వీరికి విటమిన్ల మాత్రలు మేలు చేస్తాయి.
* గర్భిణులకు: ఎప్పుడు గర్భధారణ జరుగుతుందో తెలియదు. కాబట్టి సంతానాన్ని కనాలని అనుకునేవారు రోజూ ఫోలిక్ యాసిడ్‌తో కూడిన మాత్రలు వేసుకోవటం మంచిది. గర్భం ధరించిన తొలిరోజుల్లో ఫోలిక్ యాసిడ్‌ను తీసుకుంటే పిండంలో నాడీలోపాలు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
* జీర్ణ సమస్యలు గలవారికి: సీలియాక్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు జీర్ణక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. ఇవి పోషణ లోపానికి దారితీస్తాయి. బరువు తగ్గటానికి చేసే బైపాస్ సర్జరీల వంటివీ దీనికి కారణం కావొచ్చు. వీరికి విటమిన్ మాత్రలు అవసరమవుతాయి.
* కొన్ని మందులు వేసుకునేవారికి: ఛాతీలో మంట, పులితేన్పులు తగ్గటానికి వేసుకునే ప్రొటాన్ పంప్ ఇన్‌హిబిటార్ రకం మందులు విటమిన్ బి12 సరిగా అందకుండా చేస్తాయి. కొన్ని పార్కిన్సన్స్ మందులూ * విటమిన్లను అడ్డుకుంటాయి. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తూ రక్తపోటు తగ్గటానికి తోడ్పడే మాత్రలతోనూ మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం మోతాదులు తగ్గుతాయి. ఇలాంటివారికి విటమిన్ మాత్రలు ఆయా పోషకాలు భర్తీ కావటంలో తోడ్పడతాయి.
* జబ్బుల నుంచి కోలుకునేవారికి: జ్వరం, ఇన్‌ఫెక్షన్ల వంటి జబ్బుల నుంచి కోలుకుంటున్నవారికీ మాత్రలు అవసరమవ్వచ్చు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PV Sindhu : వరల్డ్ ఛాంపియన్‌షిప్‌నకు పీవీ సింధు దూరం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Komatireddy venkatreddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కాక.. అసలు ఆయన మనసులో ఏముంది?
-
India News
Tiranga Yatra: తిరంగా యాత్ర పైకి దూసుకెళ్లిన ఆవు.. గాయపడ్డ మాజీ ఉపముఖ్యమంత్రి
-
Politics News
BJP: ఈటల సమక్షంలో భాజపాలో చేరిన సినీనటుడు సంజయ్ రాయిచుర
-
Politics News
BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!