మలంలో క్లోమ క్యాన్సర్‌ ఆనవాళ్లు

క్లోమ (పాంక్రియాస్‌) క్యాన్సర్‌ను తొలిదశలో పసిగట్టటానికి శాస్త్రవేత్తలు వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. ఇది మలంలోని  బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల ఆనవాళ్ల ద్వారా క్యాన్సర్‌ ముప్పు అధికంగా గలవారిని గుర్తిస్తుంది. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా, చాలా వేగంగా క్యాన్సర్‌ను

Updated : 14 Jun 2022 06:17 IST

క్లోమ (పాంక్రియాస్‌) క్యాన్సర్‌ను తొలిదశలో పసిగట్టటానికి శాస్త్రవేత్తలు వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. ఇది మలంలోని  బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల ఆనవాళ్ల ద్వారా క్యాన్సర్‌ ముప్పు అధికంగా గలవారిని గుర్తిస్తుంది. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా, చాలా వేగంగా క్యాన్సర్‌ను గుర్తించే ఈ పద్ధతి మేలి మలుపు కాగలదని, క్యాన్సర్‌ మరణాల నివారణకిది ఎంతగానో తోడ్పడగలదని భావిస్తున్నారు. క్లోమ క్యాన్సర్‌ అరుదైనదే అయినా ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. దీని బారినపడ్డవారు బతికి బయటపడటం తక్కువ. ప్రతి నలుగురిలో ఒక్కరే ఏడాది, అంతకన్నా ఎక్కువకాలం జీవించి ఉంటున్నారని అంచనా. దీనికి ప్రధాన కారణం త్వరగా గుర్తించలేకపోవటం. ఈ నేపథ్యంలో కొత్త పద్ధతి తొలిదశలోనే క్యాన్సర్‌ను పట్టుకోవటానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని