ఎండ హుషారు!

మితిమీరిన ఆలోచనలు, సోమరితనం ఇబ్బంది పెడుతున్నాయా? రోజూ పెందలాడే ఒంటికి ఎండ తగిలేలా చూసుకోండి. సూర్యరశ్మితో మనలోని జీవగడియారం పనితీరు మెరుగవుతుంది. రోజంతా హుషారుగా గడిపే శక్తి లభిస్తుంది.

Updated : 14 Jun 2022 06:21 IST

మితిమీరిన ఆలోచనలు, సోమరితనం ఇబ్బంది పెడుతున్నాయా? రోజూ పెందలాడే ఒంటికి ఎండ తగిలేలా చూసుకోండి. సూర్యరశ్మితో మనలోని జీవగడియారం పనితీరు మెరుగవుతుంది. రోజంతా హుషారుగా గడిపే శక్తి లభిస్తుంది. ఎండ సమక్షంలో మన చర్మం విటమిన్‌ డిని తయారుచేసుకోవటం మరో ప్రయోజనం. ఇది ఎముకల పటుత్వానికే కాదు, రోగనిరోధక శక్తి పుంజుకోవటానికీ తోడ్పడుతుంది. కుంగుబాటు లక్షణాలను తగ్గించి, మూడ్‌నూ ఉత్తేజితం చేస్తుంది. మరీ ఎక్కువసేపేమీ అక్కర్లేదు. ఐదు నిమిషాలు ఎండలో గడిపినా చాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని