చర్మం ఒరుసుకుపోతే?

కొందరికి చంకలు, రొమ్ముల కింద, తొడల మధ్య వంటి చోట్ల చర్మం ఒరుసుకుపోతుంటుంది. అక్కడంతా దద్దు మాదిరిగా కనిపిస్తుంటుంది. ఇలా చర్మం ముడతల మధ్య ఒరుసుకుపోవటాన్ని ఇంటర్‌ట్రిగో అంటారు. ఇది అధిక బరువు, మధుమేహం

Published : 21 Jun 2022 01:16 IST

కొందరికి చంకలు, రొమ్ముల కింద, తొడల మధ్య వంటి చోట్ల చర్మం ఒరుసుకుపోతుంటుంది. అక్కడంతా దద్దు మాదిరిగా కనిపిస్తుంటుంది. ఇలా చర్మం ముడతల మధ్య ఒరుసుకుపోవటాన్ని ఇంటర్‌ట్రిగో అంటారు. ఇది అధిక బరువు, మధుమేహం గలవారిలో ఎక్కువ. గాలి ఆడకుండా, చెమట ఆవిరి కాకుండా చేసే బిగుతైన దుస్తులు ధరించేవారిలోనూ వస్తుంటుంది. చర్మం ఒరుసుకుపోయేవారు స్నానం చేయటానికి 10 నిమిషాల ముందు చర్మానికి కొబ్బరినూనె రాసుకోవటం మంచిది. యాంటీబ్యాక్టీరియల్‌ సబ్బుతో రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. చర్మం పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఒకవేళ అక్కడ బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తితే డాక్టర్‌ను సంప్రదించి తగు క్రీములు వాడుకోవాలి. వదులైన దుస్తులు ధరించాలి. బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు