కేశ సంరక్షణకు కొత్త చికిత్స

జుట్టు పలచబడటం.. ఆడ, మగ తేడా లేకుండా అందరినీ కలవర పెట్టే సమస్య. వెంట్రుకలు రాలకుండా చూసుకోవటానికి ఏవేవో చిట్కాలు, తైలాలు వాడటం చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ  దీనికి సమర్థమైన చికిత్సలు అంతగా అందుబాటులో లేకపోవటం

Published : 28 Jun 2022 03:08 IST

జుట్టు పలచబడటం.. ఆడ, మగ తేడా లేకుండా అందరినీ కలవర పెట్టే సమస్య. వెంట్రుకలు రాలకుండా చూసుకోవటానికి ఏవేవో చిట్కాలు, తైలాలు వాడటం చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ  దీనికి సమర్థమైన చికిత్సలు అంతగా అందుబాటులో లేకపోవటం ఆశ్చర్యకరం. ఈ నేపథ్యంలో క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ శాస్త్రవేత్తల వినూత్న చికిత్స కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మాడు పైపొరను దాటుకొని లోపలికి చొచ్చుకెళ్లే గుణాన్ని పెంపొందించే ప్రిక్టోన్‌ ఒలమైన్‌, జింక్‌ పైరిథియాన్‌, జింక్‌ కార్బొనేట్‌, నియాసినమైడ్‌, పాంథెనాల్‌, కెఫీన్‌ వంటి కారకాలతో పాటు ఒక యాంటీఆక్సిడెంట్‌ దీనిలోని కీలకాంశాలు. మందుతో కూడిన షాంపూతో పాటు ఈ చికిత్సను కొనసాగించిన వారిలో జుట్టు తక్కువగా ఊడుతున్నట్టు తేలటం గమనార్హం. యాంటీఆక్సిడెంట్లు, విశృంఖల కణాల మధ్య సమతుల్యత దెబ్బతింటే చర్మం త్వరగా దెబ్బతింటుంది. ఇది మాడుకూ వర్తిస్తుంది కదా. ఈ భావనతోనే శాస్త్రవేత్తలు కొత్త చికిత్సతో అధ్యయనం నిర్వహించారు. ఇది మంచి ఫలితం కనబరుస్తుండటం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని