ఆస్థమా ఉద్ధృతం కాకుండా..

ఆస్థమా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. ఎంత ఉద్ధృతంగా పరిణమిస్తుందో తెలియదు. కాబట్టి ఆస్థమా గలవారు నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరం. జాగ్రత్తల విషయంలో ఏమరుపాటు తగదు.

Published : 28 Jun 2022 03:08 IST

ఆస్థమా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. ఎంత ఉద్ధృతంగా పరిణమిస్తుందో తెలియదు. కాబట్టి ఆస్థమా గలవారు నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరం. జాగ్రత్తల విషయంలో ఏమరుపాటు తగదు.

* బయటే కాదు, ఇంట్లో కాలుష్యం తక్కువేమీ కాదు. గాలి ధారాళంగా వచ్చిపోయేలా చూసుకోవాలి.
*ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చీపురుతో చిమ్మకుండా బట్టతో తుడుచుకోవాలి. ఇంట్లో ఎవరినీ సిగరెట్లు కాల్చనీయొద్దు.
* దుప్పట్లు, దిండు కవర్లను వారానికోసారి శుభ్రంగా ఉతుక్కోవాలి. వీటిని వేడి నీటిలో జాడించి, ఎండలో ఆరబెట్టి వాడుకోవాలి.
* ఇంట్లో గోడల మీద తేమ, చెమ్మ లేకుండా చూసుకోవాలి.
*  అగరు బత్తీలు, దోమల బత్తీల పొగ సోకనీయొద్దు.
* కట్టెల పొయ్యి మీద వంట చేయొద్దు. గ్యాస్‌ పొయ్యి వాడుకోవాలి.
* తాళింపు వంటి ఘాటు వాసనలు పీల్చరాదు.
* పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.
* తివాచీలు లేకుండా చూసుకోవాలి.
* వాతావరణం మారే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే మాస్కులు పెట్టుకోవాలి.
* బయటకు వెళ్లినా జేబులో ఇన్‌హేలర్‌ పెట్టుకొని వెళ్లాలి.
* మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
* సమయానికి ఫ్లూ, న్యుమోనియా టీకాలు తీసుకోవాలి. ఇవి ఆస్థమా ఉద్ధృతం కాకుండా చూస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని