నడక వేగం తగ్గిందా?

ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు. కానీ కొందరు వేగంగా దీనిలోకి జారుతుంటారు. మరి వేగంగా వయసు మీద పడుతోందని గుర్తించటమెలా? నడక వేగంతో దీన్ని తేలికగా గుర్తించొచ్చు.

Updated : 05 Jul 2022 06:50 IST

వరికైనా వృద్ధాప్యం తప్పదు. కానీ కొందరు వేగంగా దీనిలోకి జారుతుంటారు. మరి వేగంగా వయసు మీద పడుతోందని గుర్తించటమెలా? నడక వేగంతో దీన్ని తేలికగా గుర్తించొచ్చు. 40ల్లో నడక వేగం నెమ్మదించటం వృద్ధాప్యం త్వరగా ముంచుకొస్తోంది అనటానికి ఒక సూచిక. చర్మం తేలికగా కమిలి పోవటమూ ఒక సంకేతమే. వయసు మీద పడుతున్న కొద్దీ చర్మం పలుచబడుతుంటుంది. చర్మం పొర కిందుండే కొవ్వు తగ్గుతుంది. రక్తనాళాలు పెళుసుగా తయారవుతాయి. దీంతో రక్తం లీకై చర్మం తేలికగా కమిలిపోతుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని