గ్రీన్ ప్రశాంతత
గ్రీన్ టీ తాగితే ఆందోళన తగ్గిపోయి, ప్రశాంతత చేకూరుతుందని చాలామంది భావిస్తుంటారు. దీనికి కారణం గ్రీన్ టీలోని ఎల్-థియానైన్ అనే ప్రత్యేక అమైనో ఆమ్లమే. ఇందులో ఎపీగ్యాలోక్యాటెచిన్ గాలేట్ (ఈజీసీజీ) అనే ఫ్లేవనాల్ ఉంటుంది.
గ్రీన్ టీ తాగితే ఆందోళన తగ్గిపోయి, ప్రశాంతత చేకూరుతుందని చాలామంది భావిస్తుంటారు. దీనికి కారణం గ్రీన్ టీలోని ఎల్-థియానైన్ అనే ప్రత్యేక అమైనో ఆమ్లమే. ఇందులో ఎపీగ్యాలోక్యాటెచిన్ గాలేట్ (ఈజీసీజీ) అనే ఫ్లేవనాల్ ఉంటుంది. ఇది మెదడుకు హానికర పదార్థాలు చేరకుండా అడ్డుకునే వ్యవస్థను సైతం దాటుకొని వెళ్లి ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది. థియానైన్ మెదడులో అల్ఫా తరంగాల ఉత్పత్తినీ ప్రేరేపించి ప్రశాంత స్థితి కలిగేలా చేస్తుంది. ధ్యానం మాదిరిగా మానసిక చురుకుదనాన్నీ కలిగిస్తుంది. మానసికోల్లాసానికి తోడ్పడే డోపమైన్, సెరటోనిన్ రసాయనాల స్థాయులను నియంత్రించే గామా అమైనో బ్యుటీరిక్ ఆమ్లం ఉత్పత్తిలోనూ థియానైన్ పాలు పంచుకుంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
-
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
-
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
-
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
-
ప్రయాణికులు ఫుల్.. ఎంఎంటీఎస్‌లు నిల్