బాల ‘ఊపిరి’కి వ్యాయామ రక్ష!

మీ పిల్లలు పెద్దయ్యాక ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే చిన్నప్పట్నుంచే చురుకుగా ఆటలు ఆడేలా, శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా చూసుకోండి.

Published : 06 Aug 2019 02:09 IST

మీ పిల్లలు పెద్దయ్యాక ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే చిన్నప్పట్నుంచే చురుకుగా ఆటలు ఆడేలా, శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా చూసుకోండి. దీంతో యుక్తవయసుకు చేరుకునేసరికి ఊపిరితిత్తుల సామర్థ్యం గణనీయంగా మెరుగవుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. అబ్బాయిల కన్నా అమ్మాయిల్లోనే దీని ప్రభావం కనబడుతుండటం విశేషం. దీనికి కారణం అమ్మాయిల ఎదుగుదల కాస్త త్వరగా మొదలు కావటమేనని పరిశోధకులు భావిస్తున్నారు. పిల్లలు రోజుకు గంట సేపు వ్యాయామం చేయాలన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు. నూటికి ఏడుగురైనా దీన్ని పాటించటం లేదు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని