జలుబు చేసింది.. స్వైన్‌ ఫ్లూనా? 

తుమ్ములు, ముక్కు కారటం, ముక్కుదిబ్బడ వంటి సాధారణ జలుబు లక్షణాలు కనబడుతుంటాయి. అయితే మామూలు జలుబులో పెద్దగా జ్వరమేమీ ఉండదు. కాస్త నలతగా ఉండొచ్చు. ఒళ్లునొప్పులు కూడా అంతగా వేధించవు. అదే స్వైన్‌ ఫ్లూ అయితే జలుబు లక్షణాలతో పాటు గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం, దగ్గు వంటివీ కనబడతాయి. ఒళ్లునొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. నీరసం, బడలిక కూడా ఎక్కువే. దీంతో చాలామంది మంచానికే పరిమితమవుతుంటారు. మామూలు జలుబు...

Updated : 01 Jan 2019 15:05 IST


సమస్య - సలహా

సమస్య: ఇటీవల నాకు జలుబు చేసింది. ఈ మధ్యన స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాక్కూడా స్వైన్‌ ఫ్లూ వచ్చిందేమోనని అనుమానంగా ఉంది. ఇది మామూలు జలుబా? స్వైన్‌ ఫ్లూనా? అని తెలుసుకోవటమెలా?

- కల్పవల్లి, సూర్యాపేట

సలహా: ఇటీవలి కాలంలో స్వైన్‌ ఫ్లూ వైరస్‌ (హెచ్‌1ఎన్‌1) ఎక్కువగా కనబడుతున్నందున మీకు ఇలాంటి అనుమానం రావటం సహజమే. ఏమాత్రం జలుబు లక్షణాలు కనబడినా చాలామంది ఇలాగే ఆందోళన పడుతుండటం చూస్తూనే ఉన్నాం. నిజానికి స్వైన్‌ ఫ్లూలోనూ తుమ్ములు, ముక్కు కారటం, ముక్కుదిబ్బడ వంటి సాధారణ జలుబు చేసింది.. స్వైన్‌ ఫ్లూనా? జలుబు లక్షణాలు కనబడుతుంటాయి. అయితే మామూలు జలుబులో పెద్దగా జ్వరమేమీ ఉండదు. కాస్త నలతగా ఉండొచ్చు. ఒళ్లునొప్పులు కూడా అంతగా వేధించవు. అదే స్వైన్‌ ఫ్లూ అయితే జలుబు లక్షణాలతో పాటు గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం, దగ్గు వంటివీ కనబడతాయి. ఒళ్లునొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. నీరసం, బడలిక కూడా ఎక్కువే. దీంతో చాలామంది మంచానికే పరిమితమవుతుంటారు. మామూలు జలుబు గలవారైతే మిగతా పనులన్నీ బాగానే చేసుకుంటారు. మామూలు జలుబైనా, ఫ్లూ అయినా సాధారణంగా వాటంతటవే తగ్గిపోతాయి. అయితే స్వైన్‌ ఫ్లూ కొందరిలో న్యుమోనియా వంటి తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు. కొందరికి పరిస్థితి విషమించి ప్రాణాల మీదికీ రావొచ్చు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు గలవారికి, గుండెజబ్బులు గలవారికి, 65 ఏళ్లు పైబడిన వారికి, గర్భిణులు, బాలింతలు, శిశువులకు దీని ముప్పు ఎక్కువని అంతా తెలుసుకోవాలి. కాబట్టి లక్షణాలు ముదురుతుంటే ఏమాత్రం తాత్సారం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రతించాలి. అవసరమైతే డాక్టర్లు యాంటీవైరల్‌ మందులు సూచిస్తారు. దీంతో స్వైన్‌ ఫ్లూ తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. హెచ్‌1ఎన్‌1 వైరస్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీలైనంతవరకు ఇంటికే పరిమితం కావాలి. దగ్గినా, తుమ్మినా నోటికి గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోవాళ్లకు, చుట్టుపక్కల వాళ్లకు వ్యాపించకుండా చూసుకోవచ్చు.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా  
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,  
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email:  sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని