కొంచెం తినగానే పిల్లాడికి వాంతి?
సమస్య - సలహా
సమస్య: మా బాబు వయసు 2 సంవత్సరాల 8 నెలలు. గత నెల రోజుల నుంచి తిండి సరిగా తినటం లేదు. కొంచెం తినగానే వాంతి చేసుకుంటున్నాడు. ఎంజైమ్ సిరప్లు వాడినా ఫలితం కనబడటం లేదు. ఇంతకు ముందు బాగానే తినేవాడు. హఠాత్తుగా ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావటం లేదు. దీనికి పరిష్కారమేంటి?
- మాధవీ నాయుడు (ఈమెయిల్ ద్వారా)
సలహా: మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే పెద్దగా కంగారు పడాల్సిన పనేమీ లేదనే అనిపిస్తోంది. అన్నవాహిక, జీర్ణాశయం మధ్యలో ఉండే బిగుతైన కండర వలయం (ఈసోఫేగల్ స్ఫింక్టర్) వదులు కావటమే దీనికి కారణమని తోస్తోంది. సాధారణంగా మనమేదైనా తిన్నప్పుడు అది అన్నవాహిక గుండా కిందికి జారుతూ.. జీర్ణాశయం వద్దకు రాగానే ఈ కండర వలయం కాస్త వదులవుతుంది. దీంతో ముద్ద జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. ఆ వెంటనే కండర వలయం తిరిగి బిగుతుగా అయిపోతుంది. ఒకవేళ ఇది గట్టిగా మూసుకుపోకపోతే జీర్ణాశయంలోని ఆమ్లాలు, ఆహార పదార్థాలు పైకి ఎగదన్నుకు వస్తాయి. కొందరిలో వాంతి కూడా కావొచ్చు. చిన్న పిల్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా చూస్తుంటాం. దీనికి కారణం వీరిలో ఈసోఫేగల్ స్ఫింక్టర్ కాస్త వదులుగా ఉండటం. ఇది వయసు పెరుగుతున్నకొద్దీ మెరుగవుతూ వస్తుంది. అయితే కొందరిలో రెండేళ్లు దాటినా కూడా కండర వలయం బిగువును సాధించకపోవచ్చు. ఇదేమంత కంగారు పడాల్సిన విషయం కాదు. క్రమంగా మెరుగవుతూ వస్తుంది. కొన్నిసార్లు పిల్లలకు ఇష్టం లేని పదార్థాలు పెట్టినా సరిగా తినకపోవచ్చు. తిండి సహించక వాంతి చేసుకోవచ్చు. కాబట్టి ముందు మీరు పిల్లాడికి నచ్చజెబుతూ, ఇష్టమైన పదార్థాలు తినిపించే ప్రయత్నం చేయండి. అప్పటికీ ఫలితం కనబడకపోతే ఒకసారి పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రతించటం మంచిది. ఎందుకంటే అల్సర్, పూత వంటి సమస్యలతోనూ కొన్నిసార్లు పిల్లలు సరిగా తినకపోవచ్చు. వీరికి బేరియం ద్రవాన్ని తాగించి తీసే ఎక్స్‌రే గానీ గ్యాస్ట్రోస్కోపీ గానీ చేసి సమస్యను నిర్ధరించాల్సి ఉంటుంది. సమస్యలేవైనా ఉన్నట్టు తేలితే తగు చికిత్స చేస్తారు.
మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్ - 501 512 email: sukhi@eenadu.in
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్