కంటికి పచ్చందం!

పచ్చటి వాతారణం కంటికి ఆనందం కలిగిస్తుందన్నది తెలిసిందే. మరి పచ్చటి కూరలో? ఇవీ కంటికి మేలు చేసేవే. పాలకూర, తోటకూర, ఆకుపచ్చ గోబీ వంటి తాజా ఆకు కూరల్లోని ల్యూటీన్‌, జియాగ్జాంతీన్‌, విటమిన్‌ ఇ,

Published : 12 Mar 2019 00:24 IST

పచ్చటి వాతారణం కంటికి ఆనందం కలిగిస్తుందన్నది తెలిసిందే. మరి పచ్చటి కూరలో? ఇవీ కంటికి మేలు చేసేవే. పాలకూర, తోటకూర, ఆకుపచ్చ గోబీ వంటి తాజా ఆకు కూరల్లోని ల్యూటీన్‌, జియాగ్జాంతీన్‌, విటమిన్‌ ఇ, బీటా కెరటిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడతాయి. వీలైతే ఆలివ్‌ నూనెలో కాస్త వేయిస్తే పోషకాల స్థాయులు మరింత పెరుగుతాయి కూడా. ఇక రంగురంగుల కాయగూరలు, పండ్లను కూడా తోడు చేసుకుంటే కంటికి మాత్రమే కాదు.. ఒంటికీ విందే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని