కండ కలిగితే నిండు మనిషి!
మనం రోజూ రకరకాల పనులు చేస్తుంటాం. నడవటం వంటి తేలికైన పనుల దగ్గర్నుంచి బరువులెత్తటం వంటి కష్టమైన పనుల వరకూ ఎన్నెన్నో చేస్తుంటాం. వీటన్నింటినీ సజావుగా చేయాలంటే కండరాలు దృఢంగా ఉండటం ఎంతో అవసరం. కానీ వయసు మీద పడుతున్నకొద్దీ మన కండరాల మోతాదు కూడా తగ్గిపోతుంటుంది. మధ్యవయసు నుంచీ ఏటా 1-2 శాతం చొప్పున కండరాలు క్షీణిస్తుంటాయని అంచనా. ఇలా 80 ఏళ్లు వచ్చేసరికి సుమారు 40% కండరాల మోతాదు తగ్గిపోవచ్చు. శారీరక శ్రమ లేకపోవటం.. టెస్టోస్టీరాన్, గ్రోత్‌హార్మోన్ వంటి హార్లోన్లు తగ్గటం.. వయసుతో పాటు ఒంట్లో తలెత్తే వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్).. ప్రోటీన్ తగినంత తీసుకోకపోవటం వంటివన్నీ కండరాల క్షీణతకు దారితీస్తుంటాయి. కండరాలు.. ముఖ్యంగా కాలి కండరాలు బలహీనమైతే నడక వేగం తగ్గుతుంది. కింద పడిపోయే ముప్పూ పెరుగుతుంది. అయితే కండరాలకు కాసింత పని చెప్పటం, సమతులాహారం తీసుకోవటం ద్వారా దీన్ని నెమ్మదింపజేసుకునే అవకాశం లేకపోలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మధ్యవయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
* కండరాల దృఢతం పెరగటానికి బరువులను, వ్యతిరేక బలాన్ని తట్టుకునే వ్యాయామాలు (ప్రోగ్రెసివ్ రెసిస్టెన్స్) బాగా ఉపయోగపడతాయి. అందువల్ల శక్తిని బట్టి బరువులు ఎత్తటం, సాగే బ్యాండ్ల వంటి పరికరాలతో వ్యాయామాలు చేయటం మంచిది. ముందు చిన్న బరువులతో ఆరంభించి.. క్రమంగా పెంచుకుంటూ రావాలి. దీంతో తుంటి, మోకాలు, మడమలు, భుజాల కండరాలు బలోపేతమవుతాయి.
* నెమ్మదిగా కదులుతూ, కదలికలపై మనసు పెట్టి చేసే యోగా, తాయ్‌చీ వంటి సంప్రదాయ పద్ధతులు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి కండరాలను, కీళ్లను బలోపేతం చేయటంతో పాటు శరీరం తూలిపోకుండానూ కాపాడతాయి. మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది.
* ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం లభించే పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. మెగ్నీషియంతో నిండిన అంజీరా, అరటిపండు, క్యాబేజీ, చిక్కుళ్లు, పప్పులు, చేపలు.. బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు విధిగా తీసుకోవటం మంచిది.
కండరక్షీణతను గుర్తించేదెలా?
కండరాల క్షీణతను గుర్తించేదెలా? దీనికేదైనా మార్గముందా? లేకేం. పిడికిలి బలాన్ని తెలిపే డైనోమీటరు ఇందుకు ఎంతగానో తోడ్పడుతుంది. దీనిలోని పట్టీని వేళ్లతో పట్టుకొని గట్టిగా నొక్కటం ద్వారా పిడికిలి బలమెంతో తెలుస్తుంది. మహిళలైతే 16 కిలోల కన్నా తక్కువ, పురుషులైతే 26 కిలోల కన్నా తక్కువుంటే కండరాల బలం చాలా తక్కువగా ఉందని అనుకోవచ్చు. డెక్సా (ఎక్స్‌రే) పరీక్షతోనూ కండరాల మోతాదు తెలుసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు