కంటి జబ్బుకు తేలికైన పరీక్ష

మధుమేహుల్లో రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతినటం (డయాబెటిక్‌ రెటినోపతీ) పెద్ద సమస్య. ఇది చూపును కోలుకోలేని దెబ్బతీస్తుంది. మనదేశంలో 2025 నాటికి సుమారు 2 కోట్ల మంది దీని బారినపడొచ్చని అంచనా. దీన్ని గుర్తించటానికి కంట్లో చుక్కల మందు వేసి పరీక్షిస్తుంటారు. దీన్ని చేసిన తర్వాత చాలా సేపటివరకు చూపు మసక బారుతుంది.

Published : 30 Jun 2020 01:24 IST

మధుమేహుల్లో రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతినటం (డయాబెటిక్‌ రెటినోపతీ) పెద్ద సమస్య. ఇది చూపును కోలుకోలేని దెబ్బతీస్తుంది. మనదేశంలో 2025 నాటికి సుమారు 2 కోట్ల మంది దీని బారినపడొచ్చని అంచనా. దీన్ని గుర్తించటానికి కంట్లో చుక్కల మందు వేసి పరీక్షిస్తుంటారు. దీన్ని చేసిన తర్వాత చాలా సేపటివరకు చూపు మసక బారుతుంది. క్లిష్టమైన సమస్య అయితే ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ, ఫ్లూరెసీన్‌ యాంజియోగ్రఫీ వంటి అధునాతన పరీక్షలు చేస్తారు. వీటికి నిపుణులైన సిబ్బంది అవసరం. ఇలాంటి ఇబ్బందులను తొలగించటానికి గువాహటి ఐఐటీ పరిశోధకులు తేలికైన పరీక్ష పరికరాన్ని రూపొందించారు. ఇది అతి సూక్ష్మ బంగారం రేణువుల సాయంతో మూత్రం లేదా కన్నీరులో ఉండే బీటా 2 మైక్రోగ్లోబులిన్‌ను (బీ2ఎం) గుర్తిస్తుంది. డయాబెటిక్‌ రెటీనోపతీకి బీ2ఎం జీవ సూచిక కావటం విశేషం. పరికరంలోని సన్నటి గొట్టాల్లోకి మూత్రం లేదా కన్నీరును పంపించినప్పుడు.. బీటా 2 మైక్రోగ్లోబులిన్‌ ప్రొటీన్‌ సమక్షంలో బీ2ఎం యాంటీబాడీలతో కూడిన బంగారు రేణువుల రంగు మారిపోతుంది. ఇది కచ్చితమైన ఫలితాలను చూపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. పరికరాన్ని చేతిలో పట్టుకొని, ఎక్కడికైనా తీసుకుపోవచ్చని.. మారుమూల ప్రాంతాల్లో సైతం ఇది ఎంతగానో ఉపయోగపడగలదని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని