ప్రశాంతంగా..

ఏదైనా సమస్యతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు ఒకింత ఆందోళన కలగటం సహజమే. డాక్టర్‌ ఏం చెబుతారో? ఏమవుతుందో? అని చాలామంది భయపడుతూనే ఉంటారు. మామూలు జలుబు, జ్వరం లాంటి జబ్బులైతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తీవ్ర సమస్యల విషయంలో ఇంకాస్త ఎక్కువ ఆందోళన కలుగుతుంది.

Published : 30 Jun 2020 01:25 IST

ఏదైనా సమస్యతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు ఒకింత ఆందోళన కలగటం సహజమే. డాక్టర్‌ ఏం చెబుతారో? ఏమవుతుందో? అని చాలామంది భయపడుతూనే ఉంటారు. మామూలు జలుబు, జ్వరం లాంటి జబ్బులైతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తీవ్ర సమస్యల విషయంలో ఇంకాస్త ఎక్కువ ఆందోళన కలుగుతుంది. ఇది డాక్టర్‌ చెప్పే విషయాల మీద అంతగా దృష్టి పెట్టకపోవటానికి దారితీయొచ్చు. దీంతో మందులు సరైన మోతాదులో, సరైన సమయానికి వేసుకోకపోవచ్చు. చెప్పిన జాగ్రత్తలు పాటించకపోవచ్చు. అందువల్ల డాక్టర్‌ గదిలోకి వెళ్లే ముందు మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఓ తాజా అధ్యయనంలో ఇదే బయటపడింది. ఫ్లూ, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, హెర్పిస్‌ చికిత్సల కోసం వచ్చిన వారిలో మానసిక ప్రశాంతతను చేకూర్చే పనులు చేసినవారు డాక్టర్‌ చెప్పిన విషయాలను బాగా గ్రహించినట్టు తేలింది. గాఢంగా శ్వాస తీసుకోవటం, మనసుకు నచ్చిన సంగీతాన్ని వినటం వంటివీ మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. డాక్టర్‌ గదిలోకి వెళ్లేముందు ఇలాంటి తేలికైన పద్ధతులను పాటించొచ్చు. వెంట స్నేహితుడినో, కుటుంబ సభ్యులనో తీసుకెళ్తే ఇంకా మంచిది. డాక్టర్‌ చెప్పే విషయాలను గుర్తుపెట్టుకోవటానికి వీలుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని